Telangana : తెలంగాణలో రైతు రుణమాఫీ పై సవాల్ ప్రతి సవాల్ నడుస్తోంది. ఆగస్ట్ 15 లోపు రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేస్తే రాజీనామా చేస్తానన్న బీఆర్ఎస్ (BRS)ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ..తన రాజీనామా లేఖ తో అసెంబ్లీ గన్ పార్క్ వద్దకు వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన రాజీనామా లేఖతో గన్ పార్క్ వద్దకు రావాలని హరీశ్ డిమాండ్ చేశారు. దీంతో అసెంబ్లీ గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున గన్ పార్క్(Gun Park) వద్దకు నేతలు, కార్యకర్తలు రావడంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ హరీష్ రావు(Harish Rao) కార్యక్రమానికి కేవలం 5 గురికి మాత్రమే అనుమతి ఉన్నట్లు పోలీసులు వివరించారు. దీంతో బీఆర్ఎస్( BRS) కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
పూర్తిగా చదవండి..Harish Rao : బిడ్డా గన్ పార్క్ కి రా.. నువ్వో.. నేనో తేల్చుకుందాం!
రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి హరీశ్‌రావు, సీఎం రేవంత్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండాలంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గన్‌పార్క్‌కు రాజీనామా లేఖతో చేరుకున్నారు.
Translate this News: