Biomedical Course తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా బీఎస్సీ బయోమెడికల్ కోర్సు ఈ విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించినట్లు తెలిపింది.తొలిసారిగా ప్రవేశపెట్టబోతున్న ఈ కోర్సు బోధన ప్రణాళిక, తరగతుల నిర్వహణ, కార్పొరేట్ ఆసుపత్రుల భాగస్వామ్యంపై ఉన్నతాధికారులు ఇప్పటికే చర్చలు జరిపారు. ముందుగా ప్రయోగాత్మకంగా స్వయంప్రతిపత్తి గత యూనివర్సిటీల పరిధిలో ఈకోర్సును అందుబాటులోకి తీసుకురానున్నారు. 150 సీట్లతో తొలిఏడాది భర్తీ చేయాలని నిర్ణయించింది విద్యాశాఖ. ఈ దశలో ఎదురయ్యే సవాళ్లను గుర్తించి , అవసరమైతే మార్పులచేర్పులతో వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోర్సును అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న కార్పొరేట్ వైద్య రంగంలో బయో మెడికల్ సేవలకు మంచి డిమాండ్ ఉందని గుర్తించి ఈ కోర్సును ప్రవేశపెడుతున్నారు.
పూర్తిగా చదవండి..Biomedical Course : 150 సీట్లతో కొత్త బయో మెడికల్ కోర్సు..పూర్తి వివరాలివే.!
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా బీఎస్సీ బయోమెడికల్ కోర్సు ఈ విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించినట్లు తెలిపింది. తొలిసారిగా ప్రవేశపెట్టబోయే ఈ కోర్సు గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
Translate this News: