Biryani & Haleem Orders For Ramadan: పండుగ ఏదీ, ఎవరిది అనవసరం…బిర్యానీ ఉండాల్సిందే. తినాల్సిందే. అసలు బిర్యానీ పేరు చెపితేనే నోట్లో నీళ్ళూరుతాయి. అందులోనూ హైదరాబాదీ బిర్యానీ లాంటిది మరెక్కడా దొరకదు కూడా. ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా హైదరాబాద్ బిర్యానీ పేరు వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి బిర్యానీని రంజాన్ మాసంలో (Ramadan 2024) హైదరాబాదీలు తెగ తినేశాంట. నెల రోజుల వ్యవధిలోనే పదిలక్షల పేట్ల బిర్యానీ తిన్నారంటే..అర్ధం చేసుకోవచ్చను హైదరాబాదీలకు ఇది అంటే ఎంత మక్కువో. ఇప్పుడు ఈ లెక్క చెబుతున్నది కూడా ఒక్క స్విగ్గీనే (Swiggy). కేవలం ఈ ఫుడ్ డెలివరీ సంస్థ ద్వారానే పదిలక్షల బిర్యానీలు ఆర్డర్ అయ్యాయి. అదే జొమాటో, డైరెక్ట్‌గా వెళ్ళి తినడం లాంటివి కలుపుకుంటే ఈ సంఖ్య అపరిమితంగా పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
పూర్తిగా చదవండి..Hyderabad: రెచ్చిపోయిన హైదరాబాదీలు..బిర్యానీ, హలీమ్ తెగ తిన్నారు
హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్. పండగ అయినా, క్రికెట్ అయినా, ఉత్సవం అయినా బిర్యానీలు తినాల్సిందే. అలాంటిది రంజాన్ అంటే తగ్గుతారా మనోళ్ళు. అందుకే ఈ పండుగకు పది లక్షల బిర్యానీలు, 5.3 లక్షల హలీం పేట్లు తినేశారు.
Translate this News: