Save The Tigers Series: ప్రియదర్శి (Priyadarshi), అభినవ్ గోమఠం, చైతన్యకృష్ణ, జోర్దార్ సుజాత, పావని, దేవీయని శర్మ, గంగవ్వ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సీరీస్ ‘సేవ్ ది టైగర్స్’. యాత్ర మూవీ ఫేమ్ మహి వి.రాఘ ఈ సీరీస్ ను తెరకెక్కించారు. గతేడాది రిలీజైన సీజన్ 1 సూపర్ హిట్ అవ్వగా.. ఇటీవలే సీజన్ 2 కూడా విడుదల చేశారు. మార్చి 15 నుంచి డిస్నీ హాట్ స్టార్ (Disney+ Hotstar) వేదికగా ప్రసారమవుతున్న ఈ సీరీస్ కు విశేష ఆదరణ లభిస్తోంది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ తో సత్తాచాటుతుంది ‘సేవ్ ది టైగర్స్’.
పూర్తిగా చదవండి..Save The Tigers Series: ఓటీటీలో ‘సేవ్ ది టైగర్స్’ హవా .. ఇండియాలోనే టాప్ 3 సీరీస్ గా రికార్డు..!
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్యకృష్ణ, ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సీరీస్ 'సేవ్ ది టైగర్స్'. ఓటీటీలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ సీరీస్ తాజాగా మరో కొత్త రికార్డును సృష్టించింది. దేశవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన OTT షోస్ లో టాప్ 3 సీరీస్ గా నిలిచింది
Translate this News: