RS Praveen Tweet : ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా తాను బీఆర్ఎస్(BRS) పార్టీ వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు నాగర్ కర్నూల్(Nagarkurnool) పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar). తాను గొర్రెను కానని.. కాలేనని.. ఇంకెక్కడి పోవాలన్న ఆలోచన కూడా తనకు లేదన్నారు. ఎవరూ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. కడియం శ్రీహరి, కేకే వంటి సీనియర్ నేతలు బీఆర్ పార్టీని వీడటంలో తనను కూడా వారి బాటనేలోనే నడవాలని చాలా మంది ఫోన్లు చేసి చెబుతున్నారని ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడొద్దని… ఈ పరిస్థితుల్లో అండగా నిలబడాల్సిన అవసరం బీఆర్ఎస్ కార్యకర్తలు తనను కోరతున్నారని తెలిపారు. తాను పార్టీని వీడనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
పూర్తిగా చదవండి..RS Praveen Kumar : వారిలా నేను గొర్రెను కాను.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్..!
ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా తాను బీఆర్ఎస్ పార్టీ వీడే ప్రసక్తే లేదన్నారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గొర్రెను కానని..కాలేనని..ఇంకెక్కడి పోవాలన్న ఆలోచన తనకు లేదన్నారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు.
Translate this News: