Kejriwal Second Order Went out From Custody : ప్రస్తుతం దేశంలో అత్యంత హాట్ టాపిక్ ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam). ఈ కేసులో ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసిన ఈడీ(ED) కొన్ని రోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్(Kejriwal) ను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు. మార్చి 28 వరకు కోర్టు కేజ్రావాల్కు కస్టడీ విధించింది. అయితే అరెస్ట్ అయిన తర్వాత కూడా కేజ్రీవాల్ ఢిల్లీ నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు. అక్కడి నుంచి ఆదేశాలను జారీ చేస్తున్నారు. అరెస్ట్ తర్వాత ఈ రోజు రెండోసారి పరిపాలనకు సంబంధించి ఆదేశాలను జారీ చేశారు కేజ్రీవాల్. అయితే ఈ విషయం కూడా చాలా చర్చనీయాంశం అవుతోంది. ఇంతకు ముందు మొదటిసారి ఇచ్చిన ఆదేశాల మీద ఈడీ దర్యాప్తు చేస్తుండగా…ఇప్పుడు మళ్ళీ ఇవ్వడం గమనార్హంగా మారింది.
పూర్తిగా చదవండి..Kejriwal : కస్టడీ నుంచి కేజ్రీవాల్ రెండోసారి ఆదేశాలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆక్కడ నుంచే తన పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈరోజు మళ్ళీ పరిపాలనకు సంబంధించి రెండోసారి ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆరోగ్యశాఖకు సంబంధించి రెండు ఉత్తర్వులనిచ్చారు.
Translate this News: