Fight Over Mutton Curry At Wedding: పెళ్లి వేడుకల్లో మటన్ కోసం పరస్పరం ఘర్షణకు దిగిన 16మందిపై జగిత్యాల (Jagtial) పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఆత్మకూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం..ఆత్మకూరుకు చెందిన యువతికి వేములవాడకు చెందిన అబ్బాయితో పెళ్లి ఫిక్సయ్యింది. వీరి పెళ్లి వధువు ఇంటి దగ్గర ఘనంగా జరిగింది. పెళ్లికి హాజరైన వధువరుల తరపు బంధువులు, మిత్రులందరికీ కుటుంబ సభ్యులు విందు భోజనం ఏర్పాటు చేశారు. మటన్ కూర, బగారా అన్నంతో పెళ్లికి వచ్చిన అతిథులకు వడ్డించారు. వారికి ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. కానీ మద్యం మత్తులో కొందరు గందరగోళం చేశారు. అది కాస్త తీవ్ర ఘర్షణకు దారి తీసింది. పెళ్లింట రణరంగంగా మారింది.
పూర్తిగా చదవండి..TS News: పెళ్లిలో చిచ్చు పెట్టిన మటన్ ముక్క..పొట్టు పొట్టు కొట్టుకున్న బంధువులు..!
వివాహ వేడుకలో మటన్ ముక్క చిచ్చు పెట్టింది. మటన్ కోసం రెండు వర్గాలు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. 16మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఆత్మకూరులో జరిగింది.
Translate this News: