Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ రెండు రోజులుగా విచారణ చేస్తోంది. కోర్టు ఏడు రోజు లకస్టడీ ఇచ్చిన అనంతరం విచారణ మొదలుపెట్టింది.ఈరోజు ఆమెతో పాటూ కవిత భర్త అనిల్‌ను కూడా ఈడీ విచారించనుంది. నిన్న విచారణ తర్వాత కవిత మరోసారి తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇన్న భర్త అనిల్, అన్న కేటీఆర్, న్యాయవాదిలను ములాకత్ అయిన తర్వాత ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.సుప్రీంకోర్టులో ఆమె రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని … కేసులో తన ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు లేవని కవిత అందులో పేర్కొన్నారు. పిటిషన్లో ప్రతివాదిగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌ను చేర్చారు. రేపు ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
పూర్తిగా చదవండి..MLC Kavitha: కవిత భర్తను విచారించనున్న ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఏడు రోజుల కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈడీ అధికారులు కవితను విచారించారు. ఈరోజు కూడా ఆమె విచారణ కొనసాగనుంది. ఆమెతో పాటూ ఆమె భర్త అనిల్‌ను కూడా ఈడీ ఈరోజు విచారించనుంది.
Translate this News: