Group – 1 Application : తెలంగాణ(Telangana) లో మొత్తం 563 గ్రూప్-1 ఉద్యోగాల(TSPSC Group-1 Jobs) భర్తీకి రేవంత్ సర్కార్ ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ(TSPSC Group-1 Application Process) అదే నెల 23 నుంచి ప్రారంభించింది టీఎస్పీఎస్సీ (TSPSC). అయితే.. ఈ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు అంటే మార్చి 14న సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. బుధవారం సాయంత్రం నాటికి మొత్తం 2.7 లక్షల మంది అప్లై చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఆఖరి రోజు కావడంతో ఈ రోజు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ లో తమ దరఖాస్తులను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
పూర్తిగా చదవండి..TSPSC Group-1 : నేడు గ్రూప్-1 అప్లికేషన్లకు లాస్ట్ డేట్.. ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే?
563 గ్రూప్ -1 ఖాళీల భర్తీకి గత నెల 23 నుంచి టీఎస్పీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. నిన్నటిలోగా 2.7 లక్షల అప్లికేషన్లు రాగా.. ఈ రోజు ఆ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.
Translate this News: