Karimnagar district, Bhetigal: రక్షణ కల్పించాల్సిన ఉద్యోగం అది. నేరపరిశోధనే కాదు…అమాయకుల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత వారి భుజాల మీద ఉంటుంది పోలీసులకు. చాలా మంది పోలీసులు ఎంతో నిజాయితీతో, అంకిత భావంతో ప్రజలకు సేవలు అందిస్తూ మంచి గుర్తింపు పొందుతున్నారు. అలానే మరికొందరు పోలీసులు..తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాపాయస్థితిలో ఉన్న ఎందరో సామాన్యులను కాపాడి..వారి జీవితం నిలబెడుతున్నారు. గతంలో సడెన్గా హార్ట్ ఎటాక్ బారిన పడిన వారికి సీఆర్ చేసి కాపాడిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోబోతున్న కానిస్టేబుల్ కూడా అలాంటి పనే చేశారు. తాను చేస్తున్న ఉద్యోగానికి 100శాతం న్యాయం చేశారు కరీంనగర్ జిల్లాలోని కానిస్టేబుల్ జయపాల్. సమయస్ఫూర్తి, మానవతతో ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు.
పూర్తిగా చదవండి..కానిస్టేబుల్ చొరవ..భుజాల మీద మోసి మరీ ప్రాణాలు కాపాడిన వైనం
చనిపోతున్న వ్యక్తిని మోసుకుని తీసుకెళ్ళి మరీ ప్రాణాలు కాపాడారు కరీంనగర్లోని ఓ పోలీస్ కానిస్టేబుల్. పురుగుల మందు తాగాడని సమాచారం అందుకున్న కానిస్టేబుల్..2 కిలోమీటర్లు పొలాల నుంచి నడిచి ఊరికి చేరుకుని అతడిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
Translate this News: