Series of Accidents : అతివేగం(Over Speed), నిద్రమత్తు, సమయానికి ఎయిర్ బ్యాగ్స్(Air Bags) తెరుచుకోకపోవడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం… ఇలా చాలా కారణాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLA) లాస్య నందిత(Lasya Nanditha) మృతికి దారి తీశాయి. ఈ రోజు తెల్లవారు ఝామున 5.15 కు లాస్య వెళుతున్న కారు ఓఆర్ఆర్(ORR) లో ప్రమాదానికి గురైంది. ముందు సీటుకు ఆమె తల బలంగా తాకడంతో… ఇన్నర్ ఇంజ్యురీస్ అయి అక్కడిక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు… ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని కారులోంచి బయటకు తీసి పటాన్ చెరు అమేథా ఆసుపత్రికి తరలించారు. దీని తరువాత పోస్ట్ మార్టం నిమిత్తం లాస్య మృతదేహాన్ని గాంధీ హాస్పటల్‌కు తరలించనున్నట్టు సమాచారం.
పూర్తిగా చదవండి..Lasya Nandita : వెంటాడిన వరుస ప్రమాదాలు..మూడోసారి మృత్యుఒడిలోకి
ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఆమెను వరుస ప్రమాదాలు వెంటాడాయని...రెండు సార్లు తప్పించుకున్న లాస్య మూడోసారి మాత్రం తప్పించుకోలేకపోయిందని చెబుతున్నారు కుటుంబసభ్యులు.
Translate this News: