Anushka Shetty: సినిమాలు చేసిన.. చేయకపోయిన ఏ మాత్రం క్రేజ్ తగ్గని హీరోయిన్స్ అతి కొద్దీ మంది ఉంటారు. వారిలో ఒకరు అనుష్క శెట్టి.. ముద్దుగా స్వీటీ అని కూడా పిలుస్తారు. స్టార్ హీరోలతో సమానంగా ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే బాహుబలి తరువాత కొంత కాలం గ్యాప్ ఇచ్చిన అనుష్క.. రీసెంట్ గా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీతో మరో సారి హిట్ అందుకుంది. ఇక ఆ తరువాత.. తెలుగులో అనుష్క నెక్స్ట్ సినిమా ఏంటా.. అని ఎదుచూస్తున్న సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
పూర్తిగా చదవండి..Anushka Shetty: ‘శీలావతిగా’.. అనుష్క.. 14 ఏళ్ళ తర్వాత మరో సారి క్రిష్, అనుష్క కాంబో రిపీట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క.. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ వైరలవుతోంది. క్రిష్, అనుష్క కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'శీలావతి' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
Translate this News: