Malla Reddy: బీఆర్ఎస్ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరో బాంబ్ పేల్చారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో జరిగిన చిట్ చాట్ లో సంచలన విషయాలు బయట పెట్టారు. బీజేపీతో (BJP) బీఆర్ఎస్ (BRS) పొత్తు ఉండే అవకాశం ఉందని అన్నారు. పొత్తులో భాగంగా మల్కాజ్గిరి (Malkajgiri MP Ticket) ఎంపీ టికెట్ తన కుమారుడు భద్రారెడ్డికి భద్రంగా ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLA’s) ఏ పార్టీతో టచ్ లో లేరని స్పష్టం చేశారు. అందరు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగనున్నట్లు తెలిపారు.
Malla Reddy: బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు… మరో బాంబు పేల్చిన మల్లారెడ్డి
పొత్తులపై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని అన్నారు. పొత్తులో భాగంగా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ తన కుమారుడు భద్రారెడ్డికి భద్రంగా ఉందన్నారు. మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
Translate this News: