Alleti Maheshwar Reddy : తెలంగాణ బీజేపీ మొత్తానికి ఒక గాడిన పడ్డాది. అసెంబ్లీ ఎన్నికలు అయి ఇన్నాళ్ళు అవుతున్న ఫ్లోర్ లీడర్ (Floor Leader) లేక…నాయకత్వం లేక సతమతమవుతున్న బీజేపీ (Telangana BJP) ఎట్టకేలకు కుదురుకుంది. ఈ పార్టీ బీజేఎల్పీ నేతగా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డిని నియమించారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి (Katipally Venkata Ramana) లు నియమితులయ్యారు. ఇక బీజేపీ చీఫ్ విప్ పాల్వాయి హరీష్, విప్ గా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుత్తాలు…బీజేఎల్పీ ట్రెజరీ గా ఆర్ముర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిలను నియమించారు. బీజేఎల్పీ సెక్రటరీ గా రామరావు పటేల్ అపాయింట్ చేస్తూ అధికార పత్రాలను అసెంబ్లీ అధికారులకు అందించారు. అధికారిక పత్రాలను అసెంబ్లీ కి మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు తీసుకువచ్చి సమర్పించారు.
పూర్తిగా చదవండి..Telangana BJLP Leader: తెలంగాణ బీజెఎల్పీ నేతగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
బీజేఎల్పీ నేతను ఎట్టకేలకు డిసైడ్ చేసింది తెలంగాణ బీజేపీ. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని బీజేఎల్పీ నేతగా నియమించింది. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి లు నియమితులయ్యారు.
Translate this News: