KCR : మొత్తానికి మాజీ సీఎం కేసీఆర్ జనంలోకి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తుంటి ఎముకకు గాయమై ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైన కేసీఆర్…గురువారం శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లోకసభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహరచనతోపాటు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్ధేశం చేశారు కేసీఆర్.
పూర్తిగా చదవండి..KCR: రేవంత్ సర్కార్ ఉంటదో..ఉండదో..నాకైతే డౌటే..కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!
కాంగ్రెస్ సర్కార్ ఉంటుందా..ఉండదా అంటే అది వారి చేతుల్లోనే ఉందని మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి ఉద్దేశ్యంతో సీఎంను కలిసినా బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందని కాంగ్రెస్ ట్రాప్ లో పడొద్దంటూ హెచ్చరించారు. ఓటమితో నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు.
Translate this News: