Army Recruitment 2024 : ఇండియన్ ఆర్మీ(Indian Army) లో ఉద్యోగం సాధించి దేశానికి సేవ చేయాలనుకునే యువతకు ఇదో సువర్ణావకాశం. ఇండియన్ ఆర్మీలో NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ రిక్రూట్మెంట్(NCC Special Entry Scheme 56th Course- OCT 2024) కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రిక్రూట్మెంట్ కోసం అర్హత ప్రమాణాలను పూర్తి చేసే అభ్యర్థులు షెడ్యూల్ చేయబడిన చివరి తేదీ 6 ఫిబ్రవరి 2024లోపు దరఖాస్తు చేసుకోవాలి. గడువు తేదీ తర్వాత ఏదైనా దరఖాస్తులను రిజక్ట్ చేస్తారు. ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ఫారమ్‌ను ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్సైట్ joinindianarmy.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ముందు, అభ్యర్థులు తప్పనిసరిగా అర్హత, ప్రమాణాలను చెక్ చేయాలి.
పూర్తిగా చదవండి..Indian Army Recruitment 2024 : గ్రాడ్యుయేట్లకు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..!!
ఇండియన్ ఆర్మీలో 55 ఖాళీగా ఉన్న పురుషులు, మహిళల పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండటం తప్పనిసరి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ joinindianarmy.nic.in దరఖాస్తు చేసుకోవచ్చు.
Translate this News: