Annapoorani: కొలివుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతారా (Nayanthara) హిరోయిన్‌గా నటించిన అన్నపూరాణి అనే చిత్రానికి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం హిందువుల మనోభావాలు కించపరిచేలా ఉందంటూ పలు హిందూ గ్రూప్‌లు ఈ సినిమాపై కేసు పెట్టాయి. డిసెంబర్ 29 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) స్ట్రీమింగ్ కాగా.. దీనిపై ఆరోపణలు రావడంతో తాజాగా నెట్‌ఫ్లిక్స్ తన ప్లాట్‌ఫామ్ నుంచి ఈ సినిమాను తొలగించింది. నటులు నయనతారా, జై, దర్శకుడు నిలేష్ కృష్ణ, నిర్మాతలు జతిన్ సెతీ, రవీంద్రన్, పునిత్ గోయెంకాలపై ఇటీవల హిందూ ఐటీ సెల్ వ్యవస్థాపకుడు, శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి (Ramesh Solanki) కేసు పెట్టారు.
పూర్తిగా చదవండి..Annapoorani Movie: నెట్‌ఫ్లిక్స్, జీ స్టూడియోస్ నుంచి ‘అన్నపూరణి’ సినిమా ఔట్.. కారణం ఇదే
నయనతారా హిరోయిన్‌గా నటించిన అన్నపూరాణి అనే చిత్రం హిందూ మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని పలు హిందూ గ్రూప్‌లు చిత్ర బృందంపై కేసు పెట్టాయి. ఈ చిత్రం వివాదస్పదం కావడంతో తాజాగా నెట్‌ఫ్లిక్స్, జీ స్టూడియోస్‌లు తమ ఫ్లాట్‌ఫాం నుంచి సినిమాను తొలగించాయి.
Translate this News: