Unbottling the Truth: అర్చన అప్పటివరకు ఫ్రెండ్స్‌తో ఆడి పాడింది. గ్రౌండ్లో పరుగులు తీసింది. ఇంతలోనే బాగా దాహం వేసింది. బ్యాగ్ చూస్తే వాటర్ బాటిల్ ఖాళీగా కనిపించింది. ఫ్రెండ్స్ దగ్గర కూడా వాటర్ లేవు. దీంతో గేమ్ ఆపేసి ఇంటికి బయలుదేరింది. డీహైడ్రెషన్ పెరుగుతున్నట్టు అనిపించడంతో దారిలోని ఓ షాప్‌లో 20 రూపాయలు ఇచ్చి ప్లాస్టిక్ బాటిల్ కొనుగోలు చేసింది. ఆ వాటర్ తాగుతూ ఇంటికెళ్లింది. చేతిలో వాటర్ బాటిల్‌తో నీళ్లు తాగుతూ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. వెంటనే అర్చన వాళ్ల అమ్మ కంగారు పడింది. ఉదయమే టీవీలో చూసిన న్యూస్ గుర్తించింది. ‘ఎంత పని చేశావే…’ అని అర్చనను చూస్తు బాధపడింది. అర్చనకు ఏమీ అర్థంకాలేదు.. ‘నేనేం చేశానమ్మ’ అని అమాయకంగా అడిగింది. ‘ఆ వాటర్ బాటిల్ పడై ముందు’ అని అమ్మ సమాధానం ఇచ్చింది. మమ్మీ ఏదో పిచ్చి సీరియల్ చూసి ఏదో వాగుతుందని భావించిన అర్చన.. ఆ వాటర్‌ని పడేసి అసలు విషయం చెప్పమని అడిగింది. వాటర్ బాటిల్లో 2లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని అమ్మ చెప్పడంతో అర్చన కంగుతిన్నది. వెంటనే న్యూస్ కోసం నెట్ ఆన్ చేసి గూగుల్‌లో అసలు విషయాన్ని తెలుసుకుంది.
పూర్తిగా చదవండి..Plastic Water Bottle: ప్లాస్టిక్ బాటిల్లో నీరు తాగితే మీ పని గోవిందే.. బాంబు పేల్చిన సైంటిస్టులు!
ఒక లీటరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో సగటున 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని సైంటిస్టులు గుర్తించారు. నానో ప్లాస్టిక్ కణాలు శరీరంలో అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి. పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అటు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
Translate this News: