TSRTC Special Buses for Sankranti: సంక్రాంతి పర్వదినం సందర్భంగా నగరాలు, పట్టణాలకు సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్న ప్రజలకు TSRTC శుభవార్త చెప్పింది. వారికి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. పండుగకు వెళ్లే వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,484 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ తెలిపింది. అందులో 626 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ నెల 7 వ తేదీ నుంచి 15 వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: TSRTC: శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త.. టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు!
TSRTC: సంక్రాంతికి 4,484 స్పెషల్ బస్సులు.. సాధారణ ఛార్జీలతోనే.. తెలంగాణ ఆర్టీసీ శుభవార్త!
సంక్రాంతికి 4,484 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండవని ప్రకటించారు. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సదుపాయం ఈ పండుగ సీజన్లోనూ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Translate this News: