Pushpa 2: 2024 లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం 2024 ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 2021 లో వచ్చిన పుష్ప పార్ట్ 1 సీక్వెల్ గా.. ఈ చిత్రం రూపొందుతుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన పుష్ప పార్ట్ 1 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో పుష్ప 2 పై మరింత అంచనాలు పెరిగాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన అల్లు అర్జున్ పోస్టర్, గ్లింప్స్ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా స్పెషల్ లుక్ లో కనిపించిన అల్లు అర్జున్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..Pushpa 2: ‘ఈ సారి రూల్ పుష్పదే’.. ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిం పుష్ప 2. ఈ సినిమా 2024 ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా పుష్ప మేకర్స్ #2024RulePushpaKa అంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.
Translate this News: