Rashmika Madanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) మ్యారేజ్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఓ డైరెక్టర్ కమ్ హీరో అయిన వ్యక్తిని ప్రేమించి ఎంగేజ్ మెంట్ చేసుకున్న నటి.. ఆ తర్వాత అనుకోకుండా అతనితో విడిపోయింది. అయితే నిశ్చితార్థం తర్వాత వరుస సినిమాలు చేస్తున్న రష్మిక ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తెలుగు, తమిళ్ సినిమాలతోపాటు బాలీవుడ్(Bollywood) లోనూ పాగా వేస్తోంది. ఇటీవలే ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ వంగా తెరకెక్కించిన ‘యానిమల్'(Animal) బిగ్ హిట్ అయిన విషయం తెలిసిందే. కాగా ఇందులో హీరోయిన్ గా నటించిన రష్మిక తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ మూవీ సక్సె్స్ మీట్ లో పాల్గొంటున్న డైరెక్టర్ సందీప్ మూవీలో రష్మిక-రణ్బీర్ ల మతాంతర వివాహంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..రష్మిక మతాంతర వివాహంపై నెట్టింట చర్చ.. పెళ్లి చేసిన వ్యక్తి ఏమన్నారంటే
రష్మిక-రణ్ బీర్ మతాంతర వివాహం జరిపించడంపై డైరెక్టర్ సందీప్ వంగా స్పందించారు. ఈ మ్యారేజ్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. డ్రామాను మరింత ఆసక్తికరంగా చూపించేందుకు ఇలాంటి స్టోరీ క్రియేట్ చేశాను. కానీ ముస్లింలను, వారి మతాన్ని నెగెటివ్ గా చూపించే ఉద్దేశ్యం తనకు లేదన్నారు.
Translate this News: