AP Skill Universe: ఏపీలోని ప్రకాశం జిల్లా నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ,జిల్లా ఉపాధి కార్యాలయం, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఆవరణలో ఈనెల 26వ తేదీన 15 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో అపెక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్, మూత్తూట్ ఫైనాన్స్, స్కిల్ క్రాఫ్ట్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టీవీఎస్ ట్రైనింగ్ అండ్ సర్వీసెస్, ఇంనోవ్ సోర్స్ యస్ బీఐ కార్డ్స్, యమహా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, యాజాకి, పేటిఎం, హెడెర్ డ్రట్స్, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, కళ్లం టెక్స్ టైల్స్ వంటి కంపెనీలు పాల్గొననున్నాయి.
పూర్తిగా చదవండి..Jobs: నిరుద్యోగులు ఈ బంపర్ న్యూస్ మీకోసమే..ఈ జాబ్ మేళాలో పాల్గొనండి..ఉద్యోగం పట్టండి..!!
ప్రకాశం జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రైవేట్ ఉద్యోగాలను పొందే అవకాశాన్ని సర్కార్ కల్పిస్తోంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు అధికారులు.26-12-2023 రోజున 15 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.
Translate this News: