TS Nirudyoga Bruthi: తెలంగాణలో ప్రభుత్వం మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల వేళ తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఉద్యోగ ప్రకటన ఇచ్చేంత వరకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఈ మేరకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నారు. ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డే అవడంతో.. యావత్ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువత ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఉద్యోగ ప్రకటన విడుదల చేస్తారా? నిరుద్యోగ భృతి ఇస్తారా? అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
పూర్తిగా చదవండి..TS Nirudyoga Bruthi: నిరుద్యోగులకు అలర్ట్.. భృతి పొందాలంటే అర్హతలివే..!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది తెలంగాణ సర్కార్. త్వరలోనే ఉద్యోగ ప్రకటన విడుదల చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. అదే సమయంలో నిరుద్యోగులకు భృతి కూడా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. ఇందుకోసం నియమ నిబంధనలు రూపొందిస్తున్నారు.
Translate this News: