Maoist Hidma Killed In Encounter: మూడు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్.. మావోయిస్ట్ కీలక నేత హిడ్మా హతమయ్యాడా? అంటే అవుననే అంటున్నారు భద్రతా దళాలు. మడకం హిడ్మా అలియాస్ చైతు ఎన్కౌంటర్లో చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. గురువారం మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లా ఖాంకోదాదర్ అటవీ ప్రాంతంలో జరిగిన పరస్పర కాల్పుల్లో హిడ్మా చనిపోయాడని ప్రకటించారు పోలీసులు. అయితే, హిడ్మా మృతిపై మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దాంతో హిడ్మా నిజంగానే చనిపోయాడా? గతంలో మాదిరిగా ఈ ప్రకటన కూడా వట్టిదేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. పోలీసులు కాల్పుల్లో హిడ్మా చనిపోయాడంటూ గతంలోనూ వార్తలు వచ్చాయి. అయితే, ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే తాను బతికే ఉన్నానంటూ హిడ్మా నుంచి ప్రకటన వచ్చింది. దాంతో పోలీసులకు బిగ్ షాక్ తగిలినట్లయ్యింది.
పూర్తిగా చదవండి..Hidma Encounter: మావోయిస్టులకు బిగ్ షాక్.. ఎన్కౌంటర్లో హిడ్మా హతం..?
మావోయిస్టు అగ్రనేత, మూడు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ అయిన హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయాడు. బాలాఘాట్ జిల్లా ఖాంకోదాదర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయినట్లు మధ్యప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. అయితే, మావోయిస్టు పార్టీ నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.
Translate this News: