Low Temperature in Telangana: తెలంగాణ చలి తీవ్రంగా గణనీయంగా పెరుగుతోంది. సూర్యుడు కనిపిస్తే ఒట్టు అన్నట్లుగా పరిస్థితి మారింది. డిసెంబర్ మొదటి వారం నుంచి తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. బుధవారం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గడంలో చలికి జనం వణికిపోయారు. అందరూ తమ స్వెట్టర్లు తీస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే వేడి కోసం చలి మంటలు కాచుకుంటున్నారు. మరో రెండు, మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు రోజులు కూడా చలి రోజురోజుకు పెరుగుతోందని వెల్లడించారు. మూడు రోజుల తర్వాత సాధారణ స్థితికి వస్తుందని చెప్పారు.
పూర్తిగా చదవండి..Telangana: రాష్ట్రాన్ని వణికిస్తోన్న చలి.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి..!
తెలంగాణలో చలి తీవ్రత భారీగా పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలే కాకుండా.. పగటి ఉష్ణోగ్రతలు కూడా దారుణంగా పడిపోయాయి. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు.
Translate this News: