LPG Biometric Update: గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. డిసెంబర్ 31వ తేదీ లోపు గ్యాస్ కనెక్షన్స్ ఉన్న వారు కేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే.. గ్యాస్ సబ్సిడీ కట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే.. జనాలు తమ బయోమెట్రిక్ కంప్లీట్ చేసుకునేందుకు గ్యాస్ ఏజెన్సీ సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. అవును, తెలంగాణ వ్యాప్తంగా వంట గ్యాస్ కనెక్షన్స్ కేంద్రాల వద్ద ప్రజలు భారీ ఎత్తున బారులు తీరారు. దాంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద హడావుడి నెలకొంది. దీపం, ఉజ్వల, సీఎస్ఆర్ పథకాలతోపాటు సాధారణ గ్యాస్ కనెక్షన్లు కలిగిన వారు తమ తమ ఏజెన్సీలో బయోమెట్రిక్ నమోదు/కేవైసీని (KYC) పూర్తి చేయాలని చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం డిసెంబర్ 31 వరకు గడువు విధించింది. ఎవరి పేరున గ్యాస్ కనెక్షన్ ఉందో.. వారు తమ ఆధార్ కార్డును తీసుకెళ్లి బయోమెట్రిక్ పూర్తి చేయాలి. ఒకవేళ కేవైసీ పూర్తి చేయకపోతే.. సబ్సిడీ అందదు.
పూర్తిగా చదవండి..LPG Cylinder Biometric: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. డిసెంబర్ 31 లోపు ఆపని చేయకపోతే డబ్బులు రావు..
గ్యాస్ కనెక్షన్స్ ఉన్నవారు డిసెంబర్ 31 లోపు బయోమెట్రిక్ పూర్తి చేసుకోవాలి. ఎవరి పేరిట ఉందో వారు తమ ఆధార్ కార్డుతో గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే సబ్సిడీ పొందలేరు.
Translate this News: