Education Loan : సీనియర్ నేత వసుంధర రాజే, కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్, గజేంద్ర సింగ్ షెకావత్, అశ్విని వైష్ణవ్ పేర్లు సీఎం రేసులో ఉన్నప్పటికీ విజయం భజన్లాల్కే దక్కింది. రాజస్థాన్(Rajasthan) లోని 200 స్థానాలకు గాను 199 స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడ్డాయి. ఇందులో బీజేపీ 115 సీట్లు గెలుచుకుని మెజారిటీ సాధించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సీఎం రేసులో పలువురు పేర్లు వినిపించాయి. ఇందులో వసుంధర రాజే పేరు అగ్రస్థానంలో వినిపించింది. ఆమె కూడా తన బలాన్ని ప్రదర్శిస్తూ బీజేపీ అధిష్టానం ముందు సీఎం రేసులో తానే మొదటి స్థానంలో ఉన్నానని నిరూపించుకోవడం కోసం విపరీత ప్రయత్నాలు చేశారు. అనూహ్యంగా బీజేపీ అధిష్టానం భజన్ లాల్ శర్మ(Bhajanlal Sharma)ను ముఖ్యమంత్రిగా ప్రకటించింది.
పూర్తిగా చదవండి..Bhajanlal Sharma: కొడుకు ఎడ్యుకేషన్ లోన్ కట్టాలి..సాధారణ జీవితం..రాజస్థాన్ సీఎం భజన్ లాల్ ఆస్తులు ఇవే
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అనూహ్యంగా ఎంపికైన భజన్ లాల్ శర్మ సామాన్య జీవితాన్ని గడిపే వ్యక్తి. వృత్తి వ్యాపారంగా అఫిడవిట్ లో చెప్పిన ఆయనకు కోటి రూపాయల ఆస్తులు ఉన్నాయి. దాదాపుగా 50 లక్షల రూపాయల అప్పు ఉంది. దానిలో 19 లక్షలు ఆయన కొడుకు ఎడ్యుకేషన్ లోన్.
Translate this News: