ISRO Recruitment 2023: ఇస్రో.. మన దేశానికే గర్వకారణం. యావత్ ప్రపంచ దేశాల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపిన ఘనత ఇస్రోదే. భారత అంతరిక్ష సంస్థ చేసిన ప్రయోగాలు అలాంటివి మరి. అందుకే.. ప్రతి ఒక్కరికి ఇస్రో భాగస్వామ్యం అయితే బాగుండు అని ఆశపడుతుంటారు. అయితే, ఇస్రోలో పని చేయాలనుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. తాజాగా ఉద్యోగాల భర్తీకి ఇస్రో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందుకోసం పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు. కేవలం 10వ తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. టెక్నీషియన్-బి ఉద్యోగాల భర్తీకి ఇస్రో నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చునని తెలిపింది. ఇప్పటికే అప్లికేషన్స్ ప్రారంభమవగా.. డిసెంబర్ 31 చివరి తేదీగా ప్రకటించింది. ఇస్రో విడుదల చేసిన పోస్టుల వివరాలు, అర్హతలు, జీతం వంటి వివరాలను తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..ISRO: 10వ తరగతి అర్హతతో ఇస్రోలో ఉద్యోగాలు.. 50 వేలకు పైనే జీతం.. వివరాలివే..
ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే అప్లికేషన్ ప్రారంభమవగా.. డిసెంబర్ 31 చివరి తేదీ. పూర్తి సమాచారం కోసం https://www.nrsc.gov.in/ పోర్టల్‌ను సందర్శించవచ్చు.
Translate this News: