Telangana Belt Shops: తెలంగాణలో ముందు బాబులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులను మూసివేయాలని భావిస్తోంది ప్రభుత్వం. రాష్ట్రంలో బెల్ట్ షాపులను క్లోజ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. ఆ హామీ మేరకు రాష్ట్రంలో బెల్ట్ షాపుల మూసివేతకు యాక్షన్ ప్లాన్ షురూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా 2,620 వైన్ షాప్స్ ఉన్నాయి. ఇక తెలంగాణలో 12,769 గ్రామాలు ఉన్నాయి. ఒక్కో గ్రామంలో అనధికారికగా 2 నుంచి 5 వరకు బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..Telangana: మందు బాబులకు షాక్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..!
తెలంగాణలో మందు బాబులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులను మూసివేయాలని భావిస్తోంది. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బెల్ట్ షాపులను ఎత్తివేయడంతో పాటు.. వైన్ షాపుల సమయాన్ని తగ్గించనుంది.
Translate this News: