Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో మొదలైన ఈ సీజన్స్ మొదటి నుంచే ఆసక్తిగా సాగుతూ వచ్చింది. గత సీజన్స్ తో పోల్చుకుంటే సీజన్ 7 కాస్త డిఫరెంట్ గా సాగిందనే చెప్పొచ్చు. 15 వారాల పాటు సాగే ఈ షో చివరి దశకు చేరుకుంది. ఇంకా కేవలం ఒక వారం మాత్రమే మిగిలింది. 15 మంది కంటెస్టెంట్ తో పోటీపడి ఆరుగురు హౌస్ మేట్స్ ఫైనల్స్ చేరుకున్నారు. అమర్, అర్జున్, ప్రియాంక, శోభ, యావర్, పల్లవి ప్రశాంత్, శివాజీ ని టాప్ సిక్స్ గా అనౌన్స్ చేశారు నాగార్జున (Nagarjuna). ఇక ఈ చివరి వారంలో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు వారి జర్నీ వీడియోలను చూపించి వారి జ్ఞాపకాలను గుర్తు చేస్తారు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: “మీరు ఎప్పటికీ వెలిగే జ్యోతి”.. బిగ్ బాస్ మాటలకు ఎమోషనల్ అయిన అమర్..!
ఇక ఈరోజు తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ అమర్ జర్నీ వీడియోను చూపించారు. బిగ్ బాస్ ఇంట్లో అమర్ జర్నీ గురించి చక్కటి మాటల్లో సంబోధించారు. హౌస్ లో 14 వారల పాటు సాగిన తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు అమర్.
Translate this News: