TS Inter Exams : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్షలను మార్చి 1నుంచి ప్రారంభించేందుకు ఇంటర్ బోర్డు (TS Inter Board)కసరత్తు ప్రారంభించింది. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమోదం తీసుకుని ఈ వారం రోజుల్లో పరీక్షలకు సంబంధించి టైంటేబుల్ ను విడుదల చేయనుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పరీక్షలకు, జవాబు పత్రాల మూల్యాంకనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈసారి కొంతముందుగానే పరీక్షలను ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది.
గతేడాది విద్యాసంవత్సరం మార్చి 15 నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 1-15 మధ్య జేఈఈ మెయిన్ చివరి విడద పరీక్షలు ఉండటంతో ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత కనీస గడువు కంటే విద్యార్థులు ప్రిపేర్ అవడానికి వీలుంటుంది. దీనికి తోడు ఇంటర్ తర్వాతే 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని. ఈసారి జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ కాలేజీలు ప్రారంభం అవ్వడంతో కనీసం మార్చి 1వ తేదీ నుంచి పరీక్షలు మొదలు పెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లుసమాచారం. కాగా ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ ఉండనున్నాయి.
TS Inter Exams: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్షలు మార్చి 1 నుంచి షురూ చేసేందుకు ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు రెడీ చేస్తోంది. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమోదం తీసుకుని ఈ వారం రోజుల్లో పరీక్షలకు సంబంధించి టైంటేబుల్ ను ప్రకటించనుంది.
Translate this News: