తెలంగాణ సీఎం (Telangana CM) ఎవరనే అంశంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేరును ఆ పార్టీ హైకమాండ్ ఖారు చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయ సేకరణ, సీనియర్ నేతలతో చర్చ తర్వాత రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించాలని సోనియా గాంధీ తుది నిర్ణయానికి వచ్చింది. ఈ విషయాన్ని ఈ రోజు సాయంత్రం అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు హైకమాండ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం హోటల్ ఎల్లాలో సీఎల్పీ భేటీ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ సీఎల్పీ భేటీలోనే రేవంత్ పేరును ప్రకటించనున్నారు.
ఇది కూడా చదవండి: Telangana CM: తెలంగాణ సీఎం ఎంపికలో బిగ్ ట్విస్ట్.. డీకే ఇంటికి వైసీపీ ఎంపీ.. అసలేం జరుగుతోంది?
Big Breaking: తెలంగాణ కొత్త సీఎం, డిప్యూటీ సీఎంలు వీరే?
తెలంగాణ సీఎంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం హైకమాండ్ నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Translate this News: