తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించి అధికార పగ్గాలు చేపట్టనుంది. మరికొన్ని గంటల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో తెలనుంది. ఈరోజే ప్రమాణ స్వీకారం కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే సీఎం రేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం రేసులో కూడా ఏకంగా ఆరుగురు నేతల మధ్య పోటీ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ సామాజిక వర్గాల వారిగా డిప్యూటీ సీఎంలను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఖరారైన తర్వాతే డిప్యూటీ సీఎంను ఎంపిక చేయనున్నారు. సీఎం అభ్యర్థి ఎంపిక చేసే బాధ్యతను ఏఐసీసీకి అప్పగిస్తూ రేవంత్ రెడ్డి ఏక వాఖ్య తీర్మానం చేశారు. అనంతంరం ఈ తీర్మానాన్ని తుమ్మల నాగేశ్వర్ రావు బలపరిచారు. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో ఏఐసీసీ నిర్ణయమే ఫైనల్ కానుంది.
పూర్తిగా చదవండి..Telangana: డిప్యూటీ సీఎం పదవి రేసులో ఆరుగురు అగ్ర నేతలు.. ఎవరో తెలుసా..?
తెలంగాణలో సీఎం రేసులో పీసీసీ చీఫ్ రేవంత్ ముందంజలో ఉండగా.. డిప్యూటీ సీఎం రేసులో ఆరుగురు నేతలు ఉన్నారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్, సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ, అద్దంకి దయాకర్ లాంటి నేతలు ఈ పదవికి పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.
Translate this News: