బిగ్‌బాస్ సీజన్ 7 ఈ వారం నామినేషన్ల ప్రోమో అంటే ఇవాల్టి ఎపిసోడ్ ది రిలీజ్ అయ్యింది. నామినేషన్లలో భాగంగా నరకం అనే కాన్సెప్ట్ పెట్టారు బిగ్‌బాస్. ఇందులో హౌస్మేట్స్ తాము నామినేట్ చేయాలి అనుకునే ఇద్దరి మొహం మీద ఎరుపు రంగు పూయాలి. ఇందులో దాదాపు అందరూ శివాజీని టార్గెట్ చేశారు. ప్రియాంక , అమర్ నామినేషన్లు వేస్తారని తెలుసు కానీ సర్ప్రైజింగ్ గా అర్జున్ కూడా శివాజీనే నామినేట్ చేసినట్టు కనిపిస్తోంది. ఏదైతే జరగకూడదో అనుకున్నానో అదే జరిగింది అంటూ అర్జున్ శివాజీపై అసహనం వ్యక్తం చేశాడు. మరోవైపు శివాజీ కూడా అర్జున్ మీద ఫైర్ అయ్యాడు. ఇంత అయ్యాక ఫ్రెండ్‌గా ఉండలేనంటూ ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసేశాడు. గౌతమ్, శివాజీ మధ్య ఎప్పటిలానే వార్ నడిచింది. నాగార్జున కొన్ని విషయాల్లో క్లారిటీ ఇచ్చినా సరే.. గౌతమ్ శివాజీ మీద తన అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోలేదు. ఇక ప్రియాంక అయితే శివాజీ తనని సపోర్ట్ చేస్తూనే.. అంతకంటే ఎక్కువ నెగిటివ్ చేస్తున్నారు చెప్పి నామినేట్ చేసింది. ఇక శోభ కూడా ఎప్పటిలాగే తన యాటిట్యూడ్ చూపించింది. మొత్తానికి ఈ ప్రోమో చూస్తుంటే ఎక్కువ మంది హౌస్ మేట్స్ శివాజికి నామినేట్ చేశారని అర్థమవుతోంది. ఇక మొత్తానికి ఈ వారం ప్రశాంత్ తప్ప అందరూ నామినేషన్లలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారం నామినేషన్ల నుంచి సేవ్ అయిన వారు టికెట్ టూ ఫినాలే ఆడతారు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7:శివాజీని టార్గెట్ చేసిన హౌస్మేట్స్..
గత వారం శివాజీ మాట్లాడిన మాటలు ఎఫెక్ట్ చూపించడం మొదలైంది. ఈ వారం నామినేషన్లలో అందరూ అతనినే టార్గెట్ చేసినట్లుకనిపిస్తోంది. అంతలా సపోర్ట్ చేసిన అర్జున్ సైతం శివాజీని నామినేట్ చేసినట్లు తెలుస్తోంది.
Translate this News: