బంగ్లాదేశ్(Bangladesh)కి స్వాతంత్ర్యం ఇచ్చింది ఇండియానే. 1971లో పాకిస్థాన్‌పై పోరాడి బంగ్లాకు కొత్త లైఫ్‌ని ఇచ్చింది ఇండియన్ ఆర్మీ. నాటి ప్రధాని ఇందిరా గాంధీ(Indira Gandhi) బంగ్లాదేశ్‌కు చేసిన సాయం అంతాఇంతా కాదు. ఈ విషయం బంగ్లాదేశ్‌కి తెలియనది కాదు. ఇప్పటికీ బంగ్లాదేశ్‌తో భారత్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే క్రికెట్ ఫ్యాన్స్(Cricket fans) పరంగా మాత్రం బంగ్లాదేశ్ గుడ్ కాదు. స్టేడియంలోనే ప్రత్యర్థి జట్టు ఫ్యాన్స్‌పై గొడవలకు వెళ్లే నైజం బంగ్లా అభిమానులది. క్రికెటర్లను కూడా ఎగతాళి చేస్తుంటారు. అటు ప్లేయర్లు కూడా కొద్దీ కాలంగా చాలా బిల్డప్‌లు ఇస్తున్నారు. ఓ రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి జట్టని అందరు పొగుడుతుండే సరికి గర్వం తలకెక్కుతోంది. వికెట్లను తన్నడం.. అంపైర్లపై చిందులు వేయడంతో పాటు నాగిని ప్లేయర్లు నాగిని డ్యాన్స్ ఘటనలను క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. ప్లేయర్లను చూసి ఫ్యాన్స్ తయారవుతున్నారో… ఫ్యాన్స్ చూసి ప్లేయర్లు ఇలా ప్రవర్తిస్తున్నారో తెలియదు కానీ.. తాజాగా బంగ్లా క్రికెట్ ఫ్యాన్స్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
పూర్తిగా చదవండి..INDIA-BANGLADESH: బుద్ధి బయటపెట్టుకున్నారుగా.. బంగ్లా ఫ్యాన్స్ తో జాగ్రత్తగా ఉండాలి భయ్యో!
వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇండియా ఓడిన వెంటనే పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు బంగ్లా ఫ్యాన్స్. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Translate this News: