MLA Abraham: మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి (BRS Party) బిగ్ షాక్ తగిలింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్రహం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమక్షంలో ఆయన కొద్ది సేపటి క్రితం కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అబ్రహానికి ఫస్ట్ లిస్ట్ లోనే అలంపూర్ టికెట్ ను కేటాయిస్తున్నట్లు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. అయితే.. అందరికీ బీఫామ్ లు ఇచ్చిన బీఆర్ఎస్.. అబ్రహంకు ఇవ్వకుండా నామినేషన్ల చివరి వరకు ఆపింది.
ఇది కూడా చదవండి: పటాన్ చెరులో కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ కు బిగ్ షాక్
TS Elections 2023: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం బీఆర్ఎస్ పార్టీని వీడారు. రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. అబ్రహంకు మొదటగా టికెట్ ప్రకటించిన బీఆర్ఎస్ హైకమాండ్.. ఆఖరి నిమిషంలో మార్చడంతో అసంతృప్తితో ఉన్నారు.
Translate this News: