Kanguva Movie: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న చిత్రం ‘కంగువా’. 2019 లో సూర్య 39 అనే పేరుతో మేకర్స్ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 2021 లో ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన మేకర్స్ 2023 ఏప్రిల్ నెలలో అఫీషియల్ గా సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. స్టూడియో గ్రీన్ బ్యానర్.. జ్ఞాన్ వెల్ రాజా నిర్మాణంలో డైరెక్టర్ శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా తరహాలో రూపొందుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కంగువా సినిమాలో సూర్య సరసన దిశా పటానీ కనిపించనుంది. ఈ చిత్రంలో సూర్య ఆరు రకాల పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. గోవా, కేరళ, కొడైకెనాల్, రాజమండ్రీ లొకేషన్స్ లో పలు సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. రిలీజ్ కు ముందే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ మొదలైంది.
పూర్తిగా చదవండి..Kanguva Movie: చరిత్ర సృష్టించిన హీరో సూర్య.. 38 భాషల్లో విడుదల..!
హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కంగువా. తాజాగా ఈ సినిమా పై నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచేశాయి. కేవలం 10 భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన ఈ సినిమా ఇప్పుడు 38 భాషల్లో రీలీజ్ చేయాలని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Translate this News: