Telangana Elections 2023: విజయ శాంతి.. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండ్. సినిమాల్లో లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించి లేడీ సూపర్ స్టార్‌గా, దక్షిణాది అమితాబ్ బచన్గా గుర్తింపు పొందిన విజయశాంతి.. రాజకీయాల్లో తన వాగ్ధాటితో, ఘాటైన విమర్శలతో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. అయితే, సినిమాల్లో రాణించినంతగా.. రాజకీయాల్లో మాత్రం ఆమె రాణించలేకపోయారనే మాత్రం నిజం. ఆమె నిలకడలేని నిర్ణయాలే ఇందుకు కారణం అని విశ్లేషిస్తారు రాజకీయ నిపుణులు. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ సంచలనంగా నిలిచే విజయశాంతి.. ఇప్పుడు మరోసారి వార్తల్లో హెడ్లైన్లో నిలిచారు. ఇందుకు కారణం.. ఆమె మరోసారి పార్టీ మారడమే. విజయశాంతి మరోసారి బీజేపీని వీడి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందుకే ఆమె టాప్ న్యూస్‌లో నిలిచారు. ఎన్నికల వేళ రాజకీయ నేతలు పార్టీలు మారడం సహజమే. కానీ, విజయశాంతి పార్టీ మారడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. ఏ పార్టీతో అయితే తన రాజకీయ జీవితం ప్రారంభించారో అదే పార్టీకి రెండోసారి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో రెండోసారి జాయిన్ అయ్యారు.
పూర్తిగా చదవండి..Vijayashanti: రెండోసారి బీజేపీకి గుడ్ బై చెప్పిన రాములమ్మ.. ఈసారి పార్టీని వీడటానికి ఆయనే కారణమా?!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు విజయశాంతి. ఏ పార్టీతో అయితే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారో.. అదే పార్టీకి రెండుసార్లు రాజీనామా చేశారు విజయశాంతి. అంతేకాదు.. రెండోసారి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Translate this News: