SIM Cards: సైబర్ క్రైమ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. స్కామర్లు, దుండగులు సిమ్ స్వాపింగ్ ద్వారా సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. స్కామర్లు SIM స్వాపింగ్ ద్వారా వ్యక్తిగత వివరాలను సేకరించి.. వాటి సహాయంతో వారి మొబైల్లో మీ నంబర్‌ను యాక్టివేట్ చేస్తారు. ఆపై మీ నంబర్‌కు అందిన మొత్తం సమాచారాన్ని ఉపయోగించి.. కేటుగాళ్లు మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేస్తారు. స్కామర్లు సోషల్ మీడియా నుండి మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, ఆపై దానిని టెలికాం ఆపరేటర్‌కు అందజేస్తారు. వారి ఫోన్లో మీ SIM Cards కి యాక్సెస్‌ను పొందుతారు. ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా, స్కామర్ల చేతిలో బాధితులుగా మారకుండా ఉండాలంటే.. ముందుగా మన పేరిట ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. మరి అదెలాగో ఇక్కడ తెలుసుకోండి..
పూర్తిగా చదవండి..Tech Tips: మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ రన్ అవుతున్నాయో తెలుసా? జస్ట్ 4 క్లిక్స్తో తెలుసుకోండి..!
మీ పేరిట ఎన్ని సిమి కార్డ్స్ ఉన్నాయో తెలుసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ. https://sancharsaathi.gov.in/ ఈ సైట్‌ని సందర్శించడం ద్వారా మీ ఆధార్‌పై ఉన్న సిమ్ కార్డ్స్ వివరాలు తెలుసుకోండి. ఇది తెలుసుకోవడం ద్వారా స్కామర్స్ బారిన పడకుండా ఉంటారు.
Translate this News: