Joint Pain Causes and Treatment: మోకాలి కీళ్ల నుంచి పగిలిన శబ్దం చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. ఇది తీవ్రమైన సమస్యకు నాంది అని కొందరు అంటుంటారు. మోకాలు దెబ్బతినడానికి ఇదే మొదటి సంకేతమని మరికొందరు భావిస్తారు. దీని కారణంగానే మోకాలు, కీళ్ల నుండి శబ్దం వస్తుందని చెబుతారు. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు మోకాళ్ల నుండి శబ్దం చేస్తే ఆందోళనకు గురవుతారు. ఈ శబ్ధం విని ఇతరులు కూడా సెటైర్లు వేస్తారు. ఇక మీరు వృద్ధులయ్యారని పంచ్‌లు వేస్తుంటారు. కానీ, ఈ శబ్ధం రావడం వెనుక అసలు కారణం ఏంటో తెలుసా? ఈ శబ్ధం ఎందుకు వస్తుంది? ఏ సమయంలో వస్తుంది? పూర్తి వివరాలను ఇవాళ మనం తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..Health Tips: మోకాళ్లు, కీళ్ల నుంచి సౌండ్ వస్తోందా? కారణమిదేనట..!
మోకాళ్ల నుండి వచ్చే 'కట్, కట్' శబ్దాన్ని ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా అనుకుంటారు. వాస్తవానికి ఈ శబ్ధాలకు సైనోవియల్ ద్రవం లోపమే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఎవరైనా ఇలాంటి సమస్య ఎదుర్కొంటే వెంటనే వైద్యులకు చూయించుకోవాలి.
Translate this News: