సాంకేతికత రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుంది. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఓ వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. అంతరిక్షంలో ఏకంగా పామును పోలి ఉండే ఓ రోబోను తీసుకెళ్లేలా పరీక్షలు చేస్తోంది. చంద్రుడు అలాగే అంగారక గ్రహంపై పలు ప్రాంతాల్లో పరిశోధనలు చేయడానికి దీన్ని ఉపయోగించనున్నారు. ఇండియాలో కనిపించే కొండచిలువ ఆకారం.. అది కదిలే తీరును ఆధారంగా తీసుకొని ఈ సరికొత్త రోబోను తయారు చేశారు. మరో విషయం ఏంటంటే.. భారత సంతతికి చెందిన ఇంజనీరే ఈ ఐడియాను ఇవ్వడం విశేషం.
పూర్తిగా చదవండి..NASA: అంతరిక్షంలోకి వెళ్లనున్న రోబో పాము.. ఐడియా ఎవరిదో తెలుసా..?
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (NASA).. పామును పోలిన ఓ రోబోను తయారు చేసింది. చంద్రుడు, అంగారక గ్రహంపై పలు ప్రదేశాల్లో పరిశోధనలు చేసేందుకు దీన్ని రూపొందించారు. ఈ ఆవిష్కరణ ఆలోచన భారత సంతతికి చెందిన ఇంజనీర్దే కావడం మరో విశేషం.
Translate this News: