తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి గాలి అనిల్ కుమార్ రాజీనామా చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు గాలి అనిల్. నర్సపూర్ టికెట్ ను ఆవుల రాజిరెడ్డికి కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో గత కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్న అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రేపు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..TS Elections: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్ లోకి కీలక నేత!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. టీపీసీసీ ఉపాధ్యక్ష పదవికి గాలి అనిల్ కుమార్ రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
Translate this News: