Skill Scam Case: స్కిల్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఇవాళ హైకోర్టులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతుండగా.. ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను సైతం రద్దు చేయాలని కోరుతూ ఏపీ సీఐడీ అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫడవిట్లో కీలక అంశాలను పేర్కొన్నారు. చంద్రబాబు బెయిల్ కండీషన్స్ ఉల్లంఘిస్తూ కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని అన్నారు. ఈ కేసులో నిందితులైన సుమన్ బోస్, వికాస్ ఖన్వేల్కర్ లు సాక్షులను బెదిరించే విధంగా ప్రయత్నించారని సీఐడీ అధికారులు తమ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇంకా ఈ అఫడవిట్లో కీలక వివరాలను పేర్కొన్నారు. అవేంటో ఓసారి పాయింట్ల వారీగా చూద్దాం..
పూర్తిగా చదవండి..Andhra Pradesh: స్కిల్ స్కామ్ కేసులో ట్విస్ట్.. చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ సీఐడీ అఫిడవిట్..
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాక్షులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని హైకోర్టును కోరింది సీఐడీ.
Translate this News: