KTR Comments On Revanth Reddy: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు మంత్రి కేటీఆర్(KTR). వరుస సభలతో బీఆర్ఎస్ పార్టీ(BRS) చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈరోజు సిరిసిల్లలో నామినేషన్ వేశారు కేటీఆర్. అనంతరం అర్ముర్లో జీవన్ రెడ్డి(Jeevan Reddy) ప్రచారరథంలో పాల్గొన్నారు. అదే సమయంలో ప్రచారరథాన్ని ఒక్కసారిగా డ్రైవర్ ఆపివేయగా మంత్రి కేటీఆర్ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో కేటీఆర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై స్పందించిన కేటీఆర్.. తనకు అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదని.. తన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందవద్దని అన్నారు. అనంతరం ఆర్మూర్ నుంచి కొడంగల్ రోడ్‌షోలో పాల్గొనేందుకు కేటీఆర్ వెళ్లారు.
పూర్తిగా చదవండి..రేవంత్ రెడ్డిని ఓడిస్తే నరేందర్ రెడ్డికి ప్రమోషన్.. కొడంగల్‌లో కేటీఆర్ సంచలన ప్రకటన!
కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని ఓడిస్తే పట్నం నరేందర్ రెడ్డికి ప్రమోషన్ ఇప్పిస్తా అని మంత్రి కేటీఆర్ అన్నారు. కొడంగల్ పేరును చెడగొట్టిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది.. కరెంటు పోయిందని సెటైర్లు చేశారు.
Translate this News: