CM KCR Properties and Assets 2023: ఆయన జాతీయ పార్టీకి అధ్యక్షుడు.. అంతేకాదు రాష్ట్ర ముఖ్యమంత్రి.. కానీ, ఆయన పేరిట సెంటు భూమి కూడా లేదు. తిరగడానికి ఒక కారు కూడా లేదు. ఆయనెవరో కాదు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR). అవును, తన వృత్తే వ్యవసాయంగా చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎన్నికల అఫిడవిట్లో తనకు సెంటు భూమి కూడా లేదని పేర్కొన్నారు. అయితే, భూములు, ఆస్తులన్నీ కుటుంబ ఉమ్మడి ఆస్తులుగానే ఉన్నట్లు పేర్కొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ అఫిడవిట్ ప్రకారం.. గడిచిన ఐదేళ్లలో కేసీఆర్ బ్యాంక్ డిపాజిట్లు డబుల్ అయ్యాయి. గత ఎన్నికల సమయంలో అంటే 2018 డిసెంబర్ సమయానికి బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు రూ. 5.63 కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ. 11.16 కోట్లు ఉన్నాయి. ఆయన భార్య శోభ పేరిట ప్రస్తుతం రూ. 6.29 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు కేసీఆర్. ఇక బంగారు ఆభరణాలు రూ. 2.8 కిలోలు ఉన్నట్లు పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..CM KCR: కేసీఆర్కు సొంత కారు కూడా లేదు.. ఆస్తుల వివరాలు చూస్తే షాకే..!
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఆస్తులు, అప్పులు, ఆయనపై ఉన్న కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. కేసీఆర్ కు సొంతంగా కారు, భూమి ఏదీ లేదని పేర్కొన్నారు.
Translate this News: