బాలీవుడ్ నటి భారత్ బౌలర్ మహ్మద్ షమీకి ప్రపోజ్ చేసింది. నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా అంటూ అడిగింది. మహ్మద్ షమీ…భారత ఫాస్ట్ బౌలర్. వరల్డ్‌కప్‌లో అత్యధ్బుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ టోర్నీలో షమీ నాలుగు మ్యాచ్‌లే ఆడాడు. కానీ 16 వికెట్లు తీసుకున్నాడు. అందులో రెండు సార్లు 5 వికెట్లు తీసుకున్నాడు. అంతేకాదు అత్యంత తక్కువ పరుగులు కూడా ఇస్తున్నాడు. ఈ ప్రదర్శనకే ఫిదా అయిపోయింది బాలీవుడ్ నటి పాయల్ ఘోష్. షమీ నిన్ను పెళ్ళిచేసుకోవడానికి నేను రెడీ అనేసింది. అయితే దాంతో పాటూ ఒక కండిషన్ కూడా పెట్టింది. నీ ఇంగ్లీషును మెరుగుపర్చుకుంటే వెంటనే పెళ్ళి చేసుకుంటా అంది. దీన్ని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. షమీకి ఇలా ప్రపోజ్ రావడం ఇది రెండవసారి.
పూర్తిగా చదవండి..Shami gets marriage proposal:షమీ నిన్ను పెళ్ళి చేసుకుంటా..కానీ ఒక్క షరతు అంటూ నటి పాయల్ ఘోష్ ప్రపోజల్
వరల్డ్ కప్ లో భారత్ బౌలర్ మహ్మద్ షమీ దుమ్మురేపుతున్నాడు. నాలుగు మ్యాచుల్లో 16 వికెట్లు తీసి ప్రత్యర్ధులకు దడ పుట్టిస్తున్నాడు. ఈ ఆట చూసి ఫిదా అయిన బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ అతనికి ప్రపోజల్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Translate this News: