మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మిజోరాంలో ఎన్నికలు జరగగా.. ఛత్తీస్‌గఢ్‌లో కూడా మొదటి దశ ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ఈ ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు భారత ఎన్నికల సంఘం ఇప్పటికే ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఎవరైనా ఉల్లంఘిస్తే.. ఫిర్యాదులు చేసేందుకు సి-విజిల్ ఆప్‌ను లాంచ్ చేసింది. అయితే మరికొన్ని రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లాల ఎన్నికల అధికారులు ఈ సీ-విగిల్ ఆప్‌ను ప్రమోట్ చేస్తున్నారు. దీన్ని ఎలా వాడాలి అనేదానిపై అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు విద్వేష ప్రసంగాలు చేయడం, ఓటర్లను రెచ్చగొట్టడం.. డబ్బులు, మద్యం పంచడం లాంటివి చేస్తే.. వీళ్లపై ఈ సి-విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
పూర్తిగా చదవండి..c-VIGIL APP: ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే.. యాప్ ద్వారా ఇలా ఫిర్యాదు చేయండి!
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం 'సి-విజిల్' యాప్‌ను లాంచ్ చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించే అభ్యర్థులపై ఈ యాప్‌లో ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకు సంబంధించి ఫొటో లేదా వీడియోను ఆ యాప్‌లో అప్లోడ్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
Translate this News: