Shock To Sharmila: తెలంగాణ ఎన్నికల్లో YSRTP పోటీ చేస్తుందని తెలిపిన షర్మిల(Sharmila).. ఇటీవలే తాము ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తమ మద్దతు కాంగ్రెస్(Congress) పార్టీకి ఇస్తున్నట్లు షర్మిల ప్రకటించడంపై ఆ పార్టీ నేతలు భగ్గుమన్నారు, ఇన్ని రోజులు పార్టీని నమ్ముకున్న తమకు షర్మిల అన్యాయం చేసిందంటూ విమర్శలు చేశారు. ఇవాళ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గట్టు రామచంద్రరావు నేతృత్వంలో వైఎస్సార్టీపీకి మూకుమ్మడిగా తమ రాజీనామాలు ప్రకటించారు ఆ పార్టీ కీలక నేతలు. ఆంధ్ర షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన షర్మిల వెంటనే తెలంగాణను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.
పూర్తిగా చదవండి..YS Sharmila: వైఎస్ పేరును చెడగొట్టావ్.. రాళ్లతో కొట్టి ఆంధ్రకు పంపుతాం.. షర్మిలకు సొంత నేతల షాక్!
షర్మిలకు బిగ్ షాక్ ఇచ్చారు సొంత పార్టీ నేతలు. సొంత ప్రయోజనాల కోసమే షర్మిల ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆరోపించారు. ఈరోజు గట్టు రామచంద్రరావు నేతృత్వంలో వైఎస్సార్టీపీకి మూకుమ్మడిగా తమ రాజీనామాలు ప్రకటించారు. షర్మిలను రాళ్లతో కొట్టి ఆంధ్రకు పంపుతామని హెచ్చరించారు.
Translate this News: