రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్లోని హిరోషిమా నగరంపై అమెరికా అణుబాంబు వేసిన సంగతి తెలిసిందే. ఈ అణుబాంబు వేలాది మంది ప్రాణాలను బలితీసుకోవడమే కాకుండా కొన్ని దశాబ్దాల పాటు ఆ ప్రాంతాన్ని కోలుకోకుండా చేసింది. అంతేకాదు ప్రపంచ చరిత్రలో చూసుకుంటే అత్యంత విధ్వంసకరమైన దాడిగా ఇది నిలిచిపోయింది. అయితే ఇంతకంటే మరింత శక్తిమంతమైన అణుబాంబును తయారుచేసేందుకు సిద్ధమైపోయింది అమెరికా. హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబుతో పోల్చి చూస్తే.. 24 రేట్లు శక్తిమంతమైన అణుబాంబును తయారుచేసే యోచనలో ఉన్నామని పెంటగాన్ తెలిపింది.
పూర్తిగా చదవండి..Nuclear Bomb: వామ్మో.. హిరోషిమా కంటే 24 రేట్లు శక్తిమంతమైన అణుబాంబు తయారీకి ఆ దేశం సిద్ధం..
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు కంటే 24 రేట్లు శక్తిమంతమైన అణుబాంబును తయారు చేసేందేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ప్రపంచంలో భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ అణుబాంబును తయారుచేయడం అనివార్యమవుతోందని అమెరికా రక్షణశాఖ తెలిపింది. దీనివల్ల తమ దేశంతో సవాలు చేయాలనుకునేవారికి కష్టతరమవుతుందని పేర్కొంది.
Translate this News: