TSPCS JL Exam Updates: తెలంగాణలో ఏ ప్రభుత్వ ఉద్యోగానికి పరీక్షలు నిర్వహించినా.. కోర్టు దాకా వెళ్లకుండా ఫలితాలు రావడం లేదు. తప్పులను ఎత్తిచూపుతూ అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. తాజాగా జూనియర్ లెక్చరర్(JL) ఇంగ్లీష్ సబ్జెక్ట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. టీఎస్పీఎస్సీ(TSPSC) ఇటీవల నిర్వహించిన జూనియర్ లెక్చరర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్(పేపర్-2)లో 150 ప్రశ్నలకు గాను 37 ప్రశ్నలు తప్పుగా ఇచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పరీక్షలను రద్దు చేయాలని కోర్టును కోరారు. కాగా, ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం.. తప్పులపై వివరణ ఇవ్వాలంటూ టీఎస్పీఎస్సీని ఆదేశించింది. అనంతరం విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.
పూర్తిగా చదవండి..TSPSC: జేఎల్ పరీక్షను రద్దు చేయండి.. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు..
టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నియమాకాలను రద్దు చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మొత్తం 37 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని, తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా టీఎస్పీఎస్సీ ముందుకెళ్తోందని వారు ఆరోపించారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. తప్పు ప్రశ్నలపై వివరణ ఇవ్వాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది.
Translate this News: